*ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.*

*నడికూడ లో నూతన చేయూత పింఛన్ పత్రాల పంపిణీ.*

వేద న్యూస్, నడికూడ.

పేద ప్రజల సంక్షేమం, వారి అభ్యున్నతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.ఆదివారం నడికూడ మండల కేంద్రంలోని ఎం.ఆర్.సి. భవన కార్యాలయంలో మండల పరిధిలోని అర్హులైన వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల మంజూరీ పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు.ఆర్థికంగా ఇబ్బందులుఎదుర్కొంటున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని, చేయూత పింఛన్లు లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయనిపేర్కొన్నారు.ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *