వేద న్యూస్,బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన గొర్రె ల కాపర్లు చాల మంది తమ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కోదురుపాక పాత గ్రామం నుంచి ఆరెండర్ కాలనీకి వచ్చిన అనంతరం గొర్రె ల కాపర్లు అనేక వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో వారి సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఈ సమస్యలపై ఈరోజు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,ని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్,ఆధ్వర్యంలో కరీంనగర్ లో కలవడం జరిగింది . గొర్రెల మేత కోసం ఐదు ఎకరాల స్థలాన్ని, గొర్రెల మంద కోసం షెడ్లను నిర్మించాలని ఎమ్మెల్యే,ని కోరడంతో వెంటనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడటంతో పాటు లెటర్ రాశారు. గ్రామంలో 5 ఎకరాల స్థలాన్ని అతి త్వరలోనే కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.అలాగే గొర్రె ల కాపర్ల మంద ఏర్పాటు చేసుకోవడానికి షెడ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. గొర్రెల కాపరుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని సానుకూలంగా స్పందించినందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,కి బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్,కి నాగుల వంశీ గౌడ్, యాదవ సంఘం సభ్యులు.ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.