ప్రభుత్వ స్కూల్ విద్యార్థి కి మొదటి బహుమతి

వేద న్యూస్,బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం సిరిసిల్ల జిల్లాలోని గీత నగర్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా స్థాయి కామిక్ లెవెల్ పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ పోటీ లో కొదురుపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని కుడుదుల మహేశ్వరి, తండ్రి ఎల్లయ్య,జిల్లా స్థాయిలో మొదటి స్థానం రావటం జరిగింది.మొదటి స్థానం గెలిచినందుకు పాఠశాలలో విద్యార్థులు, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఇలాగే విద్యార్థులు అందరు భవిష్యత్తులో అనేక రంగాల్లో ముందుండాలి.ఉన్నత స్థానాలను చేరుకోవాలని ప్రధానోపాధ్యాయులు కోరారు.