వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:

కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో భవిష్య సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయాల అభివృద్ధి పనులను గురువారం భవిష్య సేవా సంస్థ చైర్మన్ నాగపురి రాజు స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రారంభించారు.

 

గ్రామంలోని మడేలయ దేవాలయ ప్రహరీ, గేటు అలాగే ఆంజనేయస్వామి దేవాలయ ప్రహరి నిర్మాణంతో పాటు దేవాలయ ఆవరణలో గచ్చు నిర్మాణ పనులను తమ సేవా సంస్థ ద్వారా 3,50,000 రూపాయల నిధులు వెచ్చించి పనులు పూర్తి చేశామని, గురువారం గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

 

భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని సంస్థ చైర్మన్ నాగపురి రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లాండిగ లక్ష్మణరావు,మాజీ సర్పంచులు తిరుపతిరావు, లక్ష్మణరావు,మాజీ ఎంపిటిసి శ్రీనివాస్,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.