వేద న్యూస్, వరంగల్:
భద్రకాళి అమ్మవారిని టీఎస్ఎన్పీడీసిల్ ఎస్ ఈ శ్రీనివాస్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని.. అమ్మ వారికి చీరే సారె సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకొని అమ్మ వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఏర్పడిన విద్యుత్ సరఫరా అంతరాయాన్ని పునరుద్ధరించి నిరంతర సరఫరాను అందిస్తామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తూ ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వర్షం పడుతున్న సమయంలో కరెంటు స్తంభాలకు దూరంగా ఉంటూ, ఏదైనా కరెంటు వైర్లు తెగినప్పుడు బయటకు రాకుండా జాగ్రత్త పడాలని, వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.
అందరూ సంతోషంగా ఉండాలని అమ్మ వారిని కోరుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆయనతో పాటు దేవస్థాన ట్రస్ట్ బోర్డు మెంబర్ ఓరుగంటి పూర్ణచందర్, సిల్వర్ క్రౌన్ స్కూల్ డైరెక్టర్ వడిచర్ల ప్రసాద్, 29 వ డివిజన్ బీజేపీ నాయకులు రఘు తదితరులు పాల్గొన్నారు.