- ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ది నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ వైస్ చైర్ పర్సన్, అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన “ఓటు విలువ” అనే అంశంపై హన్మకొండ లోని స్వధార్ మహిళా ఆశ్రయం లోని మహిళలకు అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యం తో నూటికి నూరు శాతం ఓటింగ్ జరిగే విధంగా చేయడం అందరి బాధ్యత అని అన్నారు. ఒటు మన హక్కు అని, ఓటు ఉండి కూడా వినియోగించు కోకపోతే ప్రశ్నించే హక్కును కోల్పోవడమేనని చెప్పారు.
ఓటు విలువ తెలియడం లేదంటే నీ విలువ నీకు తెలియడం లేదని అర్థం అని పేర్కొన్నారు. ఓటుహక్కు ఉన్న వారంతా వినియోగించుకోవాలని సూచించారు. మరుమూల్లో పోలింగ్ శాతం పెరుగుతుండగా విద్యావంతులు, మేధావులు ఉన్న అర్బన్ లో తక్కువ గా నమోదవడం సిగ్గు పడే విషయం అని వెల్లడించారు.
ఓటేసేందుకు ఆసక్తి చూపడం లేదంటే సమాజంలో మంచి మార్పుని కోరుకోవడం లేదని అర్థం అని స్పష్టం చేశారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధంలాంటిదని, దానిని సద్వి నియోగం చేసుకొని ప్రజలకు నిజ మైన సేవ చేసే నాయకుడిని ఎన్ను కోనే విధంగా ప్రజలు చైతన్యవంతం కావాలని సూచించారు. అనంతరం ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వేస్తామని డాక్టర్ అనితా రెడ్డి మహిళలచే ప్రతిఙ్ఙ చేయించారు.