- శ్రీరామ్ చక్రవర్తి అభ్యర్థిత్వం మూడో జాబితాలో ఖరారు
వేద న్యూస్, హుస్నాబాద్/ఎల్కతుర్తి:
బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా యువనేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పేరు ఖరారైంది. టికెట్ల కేటాయింపులో యువనేత పేరును పరిశీలిస్తున్నట్లు ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ముందే చెప్పింది. ఈ మేరకు సెప్టెంబర్ 29న ‘బొమ్మ వైపు చూపు!’ శీర్షికన ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో కథనం ప్రచురించింది. ఆ కథనం అక్షరాలా నిజమైంది.
మంగళవారం బీజేపీ సెంట్రల్ కమిటీ విడుదల చేసిన మూడో జాబితాలో హుస్నాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పేరును ప్రకటించారు. దాంతో ఇక హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారనుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై పని చేసిన బొమ్మ వెంకటేశ్వర్లు అలియాస్ బొమ్మ వెంకన్న వారసత్వాన్ని ఆయన తనయుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కొనసాగిస్తారని ఈ సందర్భంగా ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. బీజేపీ రాష్ట్రకార్యవర్గసభ్యులుగా ఉన్న బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పేరును ప్రకటించడం పట్ల బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రొఫైల్:

పూర్తి పేరు: బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
పుట్టిన తేదీ: 14-04-1970
స్వగ్రామం: రామచంద్రపురం, కోహెడ
తల్లిదండ్రులు: బొమ్మ కమలమ్మ – వెంకటేశ్వర్లు(మాజీ ఎమ్మెల్యే)
కుటుంబం: సతీమణి-లలితాశ్రీ
కుమారులు: వాయునందన్, గౌరవనందన్
విద్యార్హత: బీఈ, ఎల్ఎల్‌బీ
చేపట్టిన పదవులు: ఏపీ హౌజ్ ఫెడ్ చైర్మన్, ఏపీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు
