వేద న్యూస్,శాయంపేట:
శాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామం నుండి గంగిరేణి గూడెం గోరుకొత్తపల్లి, రేగొండ ,భూపాలపల్లి, కాళేశ్వరం రం వెళ్లు టకు నర్సంపేట నుండి వయా మల్లంపల్లి ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యార్థం గత పది సంవత్సరాల క్రితం అప్పటి ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ మధుసూదననా చారి కాట్రపల్లి నుండి గంగిరేణి గూడెం వరకు ఒక కోటి 16 లక్షలతో ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నిజం చేస్తూ.. బీటీ రోడ్డు వేశారు.
కాగా, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఆ దారిలో కనీసం కాలిబాటలో కూడా నడవలేని దుస్థితి నెలకొందని కాట్రపల్లి మాజీ ఎంపీటీసీ షేక్ అనిఫా గౌస్ పేర్కొంటున్నారు.
మాజీ ఎంపీటీసీ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. త్వరగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తే కనీసం ఒక్క సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ని కూడా గెలుచుకోలేని దుర్భరం స్థితిలో ఉందని, అందుకే ఎన్నికలకు కాంగ్రెస్ భయపడుతున్నదని ఎద్దేవా చేశారు.
దారి విషయమై స్థానిక శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు చొరవ తీసుకొని ఈ రహదారికి మరమ్మతు చేయించాలని కోరారు.