వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో నేడు(మంగళవారం) సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు అన్ని మండలాల నుంచి జనం భారీగా తరలి వెళ్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలకు ఆదర్శకులై జనాలు భారీగా తరలివస్తున్న తెలిపారు. ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్ ఎలాంటి వరాల జల్లు పెద్దపల్లిపై కురిపిస్తారు? అని అశేష జనవాహిని ఆత్రంతో ఎదురు చూస్తున్నారు.