వేద న్యూస్, మరిపెడ:
‘‘మీకు ఏ ఆపద వచ్చినా నేను ఉగ్గంపల్లి లోనే ఉంటా..మీకు అండగా ఉంటా’’అని బీఆర్ఎస్ పార్టీ డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్యానాయక్ అన్నారు. మరిపెడ మండలకేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ కార్ అండ్ ఆటో యూనియన్ అసోసియేషన్స్ వారికి భవన నిర్మాణం కట్టిస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా కార్, ఆటో యూనియన్ అసోసియేషన్స్ వారు రెడ్యా నాయక్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు. రెడ్యాను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ సింధూర రవి నాయక్ గారు, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వరరావు, ఎంపీపీ అరుణ రాంబాబు, జడ్పిటిసి శారదా రవీందర్, మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న, మాజీ ఒడిఎంఎస్ చైర్మన్ కుదితి మహేందర్ రెడ్డి, కౌన్సిలర్స్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, మచ్చర్ల స్రవంతి భద్రయ్య, రేఖ లలిత వెంకటేశ్వర్లు, పానుగోతు సుజాత వెంకన్న, భయ్య బిక్షం, శ్రీను, బోడ రాందాస్, కనకదుర్గ శ్రీనివాస్,కిషన్ నాయక్,హతిరామ్, ఎడెల్లి పరశురాములు, ఉపేంద్ర లింగమూర్తి, కో ఆప్షన్ సభ్యులు, మక్సూద్, హుస్సేన్, అడ్డ యూనియన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు డ్రైవర్లు ఓనర్లు తదితరులు పాల్గొన్నారు.