• ఆర్టీసీ బస్ డ్రైవర్ కండక్టర్ కు గ్రామ ప్రజలకు మధ్య ఘర్షణ!

 

వేద న్యూస్, బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని రౌండప్ బోర్డు దగ్గర లో ఉన్న బస్ స్టాప్ వద్ద చాలామంది మహిళలు, వృద్ధులు, బస్సు కోసం ఆదివారం చాలాసేపు నిలబడి ఉన్నారు. కాగా, ఆర్టీసీ డ్రైవర్లు బస్సులు ఆపకుండా వెళ్లిపోవడంతో విసి గిపోయారు. కొద్దిసేపటికి ఒక బస్సు రావడంతో మహిళలు, బస్సు ఎక్కడానికి ప్రయత్నించగా, బస్ డ్రైవర్ కొంత దూరం వెళ్లి ఆపడంతో మహిళలు, పరుగున వెళ్లి బస్సు లో ఎక్కడానికి ప్రయత్నించగా.. బస్ డ్రైవర్, కండక్టరు.. మహిళలను బస్సులోకి రానియకుండా గొడవకు దిగారు.

 

 

ఎందుకు బస్సులోకి రానివ్వడం లేదని మహిళలు అడగడంతో.. డ్రైవర్, కండక్టర్, అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ.. గ్రామ యువకులు, పెద్దలు బస్సుకు అడ్డం నిలబడి.. మీరు ఎందుకు బస్సులు ఆపడం లేదని నిలదీశారు. డ్రైవర్, కండక్టరు, గ్రామ ప్రజల మధ్య ఒక రెండు నిమిషాలపాటు మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత ప్రయాణికులను బస్సులో తీసుకొని బస్సు వెళ్ళిపోయింది. 

కాగా, కొదురుపాకలో రెండు చోట్ల బస్సు స్టాపులు ఉన్న బస్సులు ఆపకపోవడంతో  గర్భిణులు , వృద్ధులు, వేరే ప్రాంతాలకు పనికి వెళ్లే కార్మికులు  తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు.  కాబట్టి స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అలాగే బస్ డిపో మేనేజర్లు, ఈ సమస్యపై చొరవ తీసుకొని ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా బస్సులు ఆపేలా చేయాలని గ్రామ ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.