• ఉదయం వాట్సాప్ గ్రూపులో పోస్టు .. రాత్రి సస్పెన్షన్ ఆర్డర్
  • కలెక్టరేట్‌లో అధికారిక సిమ్, ఫోన్ అందజేయాలని ఆదేశాలు
  • చర్చనీయాంశంగా కలెక్టర్ యాక్షన్

వేద న్యూస్, కరీంనగర్:

రాజన్న సిరిసిల్ల డీపీఆర్‌వో పై సస్పెన్షన్ వేటు జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీపీఆర్‌వో ఈ నెల 24న ప్రభుత్వ విప్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులకు వ్యతిరేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆఫీసర్స్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూపులో పోస్టులు చేశారని పేర్కొంటూ.. అదే రోజు(బుధవారం) రాత్రి సస్పెన్షన్ ఆర్డర్ కలెక్టర్ నుంచి రావడం సంచలనంగా మారింది. 24 గంటల్లోనే కలెక్టర్ యాక్షన్ తీసుకోవడం గమనార్హం.. ఇదే క్రమంలో సదరు సస్పెన్షన్ ఆర్డర్ లో కలెక్టర్.. కలెక్టరేట్‌లో ఏవోకు అధికారిక సిమ్, ఫోన్ అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు రాజన్న సిరిసిల్ల హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని, ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడికి వెళ్లొద్దని సూచించడం గమనార్హం. 

డీపీఆర్‌వో సస్పెన్షన్..ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్