- గ్రూప్- 2 లో మెరిసిన కమలాపూర్ వాసి
- ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐగా ఎంపిక
- పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాన్ని ముద్దాడిన యువకుడు
- యువతకు ఆదర్శంగా జడల నరేశ్
వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:
రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం వెలువరించిన గ్రూప్-2 ఫలితాల్లో కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన జడల నరేష్ అనే యువకుడు 299 ర్యాంకు సాధించి ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ ఎస్సైగా సెలెక్ట్ అయ్యారు. దీంతో నరేశ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా కానీ తల్లి ప్రోద్బలంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి నేటి యువతకు ఆదర్శంగా నరేష్ నిలిచారని పలువురు పేర్కొన్నారు. నరేశ్ కు కమలాపూర్ యువత గ్రామస్తుల తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
ఒకటి నుండి పదవ తరగతి వరకు కమలాపూర్‌లో చదువుకున్న నరేశ్.., బిటెక్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యాడు. గత కొద్దిరోజుల క్రితం గ్రూప్-4 లో జూనియర్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయి హసన్ పర్తి తహసిల్దార్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూనే.. గ్రూప్ 2 కు ప్రిపేర్ అయ్యాడు. తాజాగా విడుదలయిన ఫలితాల్లో గ్రూప్-2 గెజిటెడ్ అధికారిగా ఎంపిక కావడం పట్ల నరేశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల్లో సంతోషం వ్యక్తమయింది.
‘ఫైర్’మెన్ టు గ్రూప్-2 ఆఫీసర్.. ఎక్సయిజ్ ఎస్ఐగా కనగర్తివాసి కొత్త రాజు