- దివ్యాంగుల సేవ విశ్వమానవసేవ
- అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు అనితారెడ్డి
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన శనివారం వరంగల్లోని లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల పిల్లలకు దీపావళి పండుగ సందర్భంగా నిత్యావసర సామగ్రి అందజేశారు. పిల్లలు మూడ్రోజులు సంతోషముగా పిండి వంటలు, స్పెషల్ భోజనం చేయాలనే ఆలోచనతో వాటికి సంబంధించిన అన్ని సరుకులు, సామగ్రి, బియ్యం, పండ్లు, స్వీట్లు అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ పండుగ అంటే మనం మాత్రమే సంతోషంగా ఉండటం కాదని, పది మందిని సంతోష పెట్టడం అని చెప్పారు. అందుకే పండుగ రోజులకే కాక నెలకు సరిపడా సరుకులు అందించామని తెలిపారు. దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని ఆమె వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ తమకు తోచిన మేర ఈ పిల్లల సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పిల్లలు పాటలు పాడి వినిపించారు. అనంతరం అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి, శ్రీలత, మణికంట, పిల్లలు, సిబ్బంది పాల్గొన్నారు.