వేద న్యూస్, బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం అనే నినాదంతో ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్రంలోని ప్రతి గ్రామములో ముగ్గురు రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ శాఖ ద్వారా ఇవ్వడం జరిగింది.

ఇందులో భాగంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలములోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కరీంనగర్, అలాగే వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో రైతులు సాగు చేస్తున్న విత్తనోత్పత్తి క్షేత్రాలు (డబ్ల్యూ జి ఎల్ 915 మరియు డబ్ల్యూ జి ఎల్ 44) మీద క్షేత్ర సందర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా వానాకాలంలో రైతులకు పంపిణీ చేసిన నాణ్యమైన వరి విత్తనాలను పండిస్తున్న రైతుల నుండి ఆయా గ్రామాలలోని మిగతా రైతులందరూ కూడా ఈ విత్తనాన్ని తీసుకొని మంచి దిగుబడులు పొందాలని సూచించారు.

తదుపరి నాణ్యమైన విత్తన సాగు చేస్తున్న రైతులు అనుభవాలను తెలియపరుస్తూ, రాబోవు కాలంలో ఇతర రైతులకు కూడా వాళ్ళు ఉత్పత్తి చేసిన విత్తనాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. తదుపరి విత్తనోత్పత్తి క్షేత్రాలను మరియు చిరు సంచి దశలో ఉన్న వరి వంగడాల క్షేత్రాలను శాస్త్రవేత్తలు అలాగే అధికారుల బృందం పరిశీలించి ..రైతులకు తగు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ శాస్త్రవేత్త డా. ఇ. రజనీకాంత్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కరీంనగర్ శాస్త్రవేత్త డా. కె. మదన్ మోహన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి ప్రణీత,రైతులు పాల్గొన్నారు.