• తండ్రి గెలుపు కోసం తనయుడి ప్రచారం 

వేద న్యూస్, ఎలిగేడు:

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలకేంద్రంలో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయన రాకతో మండల వ్యాప్తంగా గులాబీ శ్రేణులలో జోష్ వచ్చింది.

 బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా ప్రశాంత్ రెడ్డి చాలా చురుకుగా ముందుకు వెళుతూ.. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ..రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలను చాలా చక్కగా వివరించారు.

ప్రచారంలో అలసట లేకుండా “అన్నా బాగున్నావా ..అక్క బాగున్నావా ..తమ్ముడు బాగున్నావా..” అంటూ చాలా ఆప్యాయంగా పలకరిస్తూ అందరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు.

రైతులకు “రైతుబంధు” గురించి వివరిస్తూ.. వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ గురించి వివరిస్తూ ముందుకు సాగారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే వర్గాల వారికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ మండిగా రేణుక రాజనర్సు, ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, మండల అధ్యక్షుడు బైరెడ్డి రామిరెడ్డి కేడీసీసీ చైర్మన్ భాస్కర్ రెడ్డి , కొండాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సాయి, అనిల్, తిరుపతి రెడ్డి ,మల్లారెడ్డి, రాజేశం, మల్లేశం, సమ్మయ్య  తదితరులు పాల్గొన్నారు.