- మెరుగైన వైద్యం కోసం సిరిసిల్లకు తరలింపు
- ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట:
ఓ బాలుడికి జ్వరం రావడంతో స్ధానిక ఆర్ఎంపి వైద్యునికి చూపించడంతో ఇంజక్షన్స్, సెలెన్స్ పెట్టి ఐ డోస్ చికిత్స అందించడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యుల కథనం మేరకు రాచర్ల గుండారం గ్రామానికి చెందిన పండుగ దేవేందర్ బాలమణి దంపతుల కుమారుడు పండుగ శివన్షు ఐదు రోజుల క్రితం జ్వరం రావడంతో అదే గ్రామానికి చెందిన ఓ ఆర్ ఎం పి వద్దకు తీసుకెళ్లగా.. ఇంజక్షన్స్ తోపాటు మందులు, గ్లూకోస్ పెట్టి ..అచ్చిరాని వైద్యం అందించారు.
తమ కుమారునికి ఒళ్లంతా దద్దులు పైకి తేలి అపస్మానిక స్థితిలోకి వెళ్లాడని ఆరోపించారు. వెంటనే దేవేందర్ భార్య బాలమణి ..గత రాత్రి మెరుగైన వైద్యం కోసం సిరిసిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
బాలుడి పరిస్థితి కొత్త విషమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారని మీడియాతో తెలిపారు. అచ్చిరాని వైద్యం అందించి తమ కుమారునీ ఆరోగ్యంతో చెలగాటమాడారని వైద్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాలుడి తండ్రి దేవేందర్ ఉపాధి నిమిత్తం వారణాసిలో ఉన్నట్లు పేర్కొన్నారు.