- ఏటునాగారం వైల్డ్ లైఫ్ శాంక్చువరీ లో 80 రకాలకు పైగా బట్టర్ ఫ్లై స్
వేద న్యూస్, వరంగల్:
ఓరుగల్లు వైర్లెస్ సొసైటీ, ములుగు అటవీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రథమంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతాకోకచిలుకల సర్వే విశేష స్పందన లభించింది. తెలంగాణలో 150 కి పైగా సీతాకోక చిలుకల జాతులు ఉండగా … ఏటునాగారం వైల్డ్ లైఫ్ శాంక్చువరీ లో 80 రకాలకు పైగా సీతాకోక చిలుకల జాతులను గుర్తించడం జరిగింది. ఈ సర్వేలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 60 మందికి పైగా పరిశోధకులు చిత్ర చాయాగ్రహకులు పర్యావరణవేత్తలు పాల్గొన్నారు.
కార్యక్రమంలో నాలుగో రోజు (ఆదివారం) ములుగు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన ముగింపు ఉత్సవాలలో సీతాకోక చిలుకల సర్వేలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రము అందించారు.
పర్యావరణ సమతుల్యతలో కీలకపాత్ర పోషిస్తున్న సీతాకోక చిలుకల మనుగడకు పర్యావరణవేత్తలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి సర్వేలు నిర్వహించి, వాటి మనుగడకు దోహదపడాలని జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు.
కార్యక్రమంలో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షులు ఇందారం నాగేశ్వరరావు, కార్యదర్శి చెలుకూరి శ్యాంసుందర్, జాయింట్ సెక్రెటరీ రవి బాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు , వివిధ స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొన్నారు.


