- బీఆర్ఎస్ నాయకులు గొట్టం మహేష్ ధీమా
వేద న్యూస్, సుల్తానాబాద్:
పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని 9వ వార్డు బీఆర్ఎస్ నాయకులు గొట్టం మహేష్ ఖరాకండిగా చెప్పారు. బుధవారం 9వ వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ప్రతీ ఒక్క కుటుంబం లబ్ది చెందిందన్నారు. దాసరి మనోహర్ రెడ్డినీ మళ్లీ గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు విజ్జగిరి సంజీవ్, గొట్టం శ్రీను, కాంపల్లి రాజు, వహీద్ తదితరులు పాల్గొన్నారు.