- గ్రామాలు అభివృద్ధి జరగాలంటే బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలి
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డవేణి గోపి
వేద న్యూస్,బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డవేణి గోపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని, ఉజ్వల గ్యాస్, రేషన్ బియ్యం, నరేగా పనులు, పీఎంజిఎస్వై రోడ్లు, వీధి దీపాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే సాధ్యమయ్యాయని తెలిపారు.
కేంద్ర హెూంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సీఆర్ఎఎఫ్ నిధులతో రోడ్ల విస్తరణకు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హామీల పై నమ్మకం పెట్టవద్దని, బీజేపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థులు గెలిస్తే గ్రామానికి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులు అందిస్తామని హామీని పునరుద్ఘాటించారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎడపల్లి పరశురాం, మండల ఇన్చార్జ్ దుబాల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదారి నరసింహ చారి, మాజీ మండలాధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు క్యాతం తిరుపతిరెడ్డి, బొంగోని అశోక్ గౌడ్, జువ్వెంతుల శ్రీనివాస్ రెడ్డి, కొండమ్ శ్రీనివాస్ రెడ్డి, పాలోజు రాజేంద్రప్రసాద్, సుంకపాక ప్రభు, సారంపల్లి రాజు, అమీరిశెట్టి గంగయ్య, స్వామి కుమార్, అలాగే సూదుల సాయికుమార్, రమేష్, ధర్మేంద్ర, వినోద్, అనిల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.