వేద న్యూస్,ఇల్లంతకుంట:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సామాజిక ఉద్యమ కారుడు, ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ సావనపెల్లి రాకేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా”బి. ఆర్. అంబేద్కర్ ఈ నెల 6న, వర్ధంతి సందర్బంగా దళిత బహుజన అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడిని స్మరించుకోవడానికి మండల కేంద్రంలో ఈ నెల 6న, దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్మారక సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. స్మారక సభ కార్యక్రమానికి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు మేధావులు హాజరు కానున్నారని అన్నారు. సామాన్యుడికి రాజ్యాంగం ఎలా ఉపయోగ పడుతుందో వివరిస్తూ రాజకీయ అధికారం రాజ్యాంగాన్ని ఎలా ఉపయోగించాలో పల్లె పల్లె కు రాజ్యాంగ ఫలాలు అందేలా అందరినీ చైతన్య పరుస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా మహనీయుడి స్మారక సభ నిర్వహించడం జరుగుతుందనీ మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి మాజీ ప్రజా ప్రతినిధులు, మేధావులు, అంబేద్కరిస్థులు, విద్యార్థులు, దళిత బహుజన ప్రజా సంఘాల అధ్యక్షులు, నాయకులు, విద్యార్థులు, యువజన నాయకులు రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో యువజన సంఘాల జేఏసీ మండల కన్వీనర్ మామిడి విజయ్, బహుజన ఉద్యమ కారుడు ఏనుగుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.