వేద న్యూస్, వరంగల్ :
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నూతన కమిటీ బుధవారం ఎన్నుకోబడింది.మూఢనమ్మకాల నిర్మూలన లక్ష్యంగా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు బైరి నరేష్ అన్నారు. ఈ కమిటీలో వరంగల్ జిల్లా అధ్యక్షులుగా సింగారపు రాజు కుమార్ , వర్కింగ్ ప్రెసిడెంట్ గా బిట్ల వెంకటేష్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి గా బిస్కే కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి యార్లగడ్డ సుబ్బారావు, జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇబ్రహీం ,జిల్లా సహాయక కార్యదర్శి కొండ్రా రఘుపతి, జిల్లా అధికార ప్రతినిధి కొంగ శ్రవణ్ కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి బాస్కే శైలు, జిల్లా కోశాధికారి దానం శేంకర్ లింగం గా ఎన్నుకోబడ్డారు. ఈ కమిటీనీ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు బైరి నరేష్ ,సమన్వయ కర్త గాండ్ల సుజాత ఆమోదించారు.