వేద న్యూస్, కాసిపేట:

కాసిపేట మండలంలో సాగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మంగళవారం ప్రత్యేక పర్యటన నిర్వహించారు. కాసిపేట ఎస్సై ఆంజనేయులు, దేవాపూర్ ఎస్సై గంగారంలతో కలిసి నామినేషన్ కేంద్రాలను సందర్శించిన సందర్భంగా ఏర్పాట్లు, భద్రతా పర్యవేక్షణ, క్యూలైన్స్, అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియను సమీక్షించారు. నామినేషన్ కేంద్రాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా, శాంతియుత వాతావరణంలో ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు.ఎన్నికల సమయంలో ప్రజలు, అభ్యర్థులు నియమాలు పాటించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని సిఐ సూచించారు.
కాసిపేట మండలంలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా సాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.