– రూరల్ సీఐ పీ.వెంకట్
వేద న్యూస్, శంకరపట్నం :
జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పోలీసులు మండలంలోని మెట్టుపల్లి, కాచాపూర్ గ్రామాలలో గురువారం రోజున గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు చేయడం జరిగినది. ఈ సందర్భంగా హుజురాబాద్ రూరల్ సీఐ పి. వెంకట్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలని, ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ర్యాలీ నిర్వహించడం లేదా ప్రచార వాహనాలను వినియోగించడం కోసం ముందుగా సంబంధిత అధికారుల నుండి ప్రతి ఒక్క అభ్యర్థి అనుమతి తీసుకోవాలని, ఒకవేళ ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే చట్టప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని, సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టడం గానీ, మెసేజ్లు పెట్టే చర్యలు పలు సమస్యలకు దారితీస్తాయని, ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో తమకు నచ్చిన అభ్యర్థికి స్వచ్ఛందంగా ఓటు వేసే హక్కును వినియోగించుకోవాలి.ఎవరైనా ప్రజలకు ఆటంకం కలిగించిన, ఇబ్బంది పెట్టిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి గ్రామాల్లో శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికలు జరగడానికి గ్రామ ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై శేఖర్ రెడ్డి తో పాటు పోలీస్ సిబ్బంది, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.