- శాస్త్రిపురం నియోజకవర్గంగా మార్చే యత్నం
- పునర్విభజనకు మజ్లిస్ పన్నగాల ప్రణాళికలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తోకల పిలుపు
- బీజేపీ గెలిస్తే మజ్లిస్ కుట్రలు సాగవు
- కాషాయం పార్టీ రాజేంద్రనగర్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి
వేద న్యూస్, రాజేంద్ర నగర్:
రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంతో కుమ్మక్కై కుట్ర పూరితమైన రాజకీయాలకు పాల్పడుతున్నాయని నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గం ప్రచారంలో బాగంగా గురువారం ఆయన నివాసంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీశైలం రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి మీడియాతో సమావేశమై మాట్లాడారు.. ప్రజలను మోసం చేసే ప్రచారం చేస్తున్న పార్టీలతో నియోజకవర్గం ప్రజలు జాగ్రత్త కలిగి ఉండాలన్నారు. మొన్నటి వరకు రాజేంద్రనగర్ లో పోటీ చేసి నియోజకవర్గంను కైవసం చేసుకుంటామని మజ్లిస్ ధీమా వ్యక్తం చేసిందన్నారు. అలాంటిది ఓ హిందూ మతానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చి నిలబెట్టడంపై ఆలోచించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకే నమ్మకం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే స్థానిక సమస్యలను పరిష్కరించడం లేదని వివరించారు. నియోజకవర్గంలోని భూములను వేల కోట్ల రూపాయలకు వేలం వేస్తున్న, కనీస స్కూల్ కాంపౌండ్ కోసం స్థలం విషయంలో ప్రభుత్వం తో మాట్లాడి చేయలేకపోయారని విమర్శించారు. నియోజకవర్గంలో మజ్లిస్ తో బీఅర్ఎస్ ఓ ఒప్పందంతో పనిచేస్తుందన్నారు. బిఅర్ఎస్, ఎంఐఎం పూర్తిగా కుమ్మకై రానున్న 2029 ఎన్నికల 2026లో నియోజకవర్గాల పునర్విభజన (డి లిమిటేషన్స్) కు ప్రణాళికతో ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు.
రానున్న ఎన్నికల్లో ఈ పునర్విభజనతో హిందూ ఓట్లను చీల్చి వారి వర్గాల ఓటర్ల శాతం డివిజన్లు స్థాయిలో పెరిగే విధంగా రూపొందిస్తున్నారని స్పష్టం చేశారు. సులేమాన్ నగర్, శాస్త్రిపురం, శివరాంపల్లీ, అత్తాపూర్, మైలార్ దేవ్ పల్లి డివిజన్ లతో శాస్త్రిపురం నియోజకవర్గం ఏర్పాటుకు పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. అలా నియోజకవర్గం మజ్లిస్ పెంచుకుని తిష్ట వేసెందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. రేపు జరిగే ఎన్నికల అనంతరం విభజన చేసి నియోజకవర్గంలో మజ్లిస్ సీటు కేటాయించుకునెందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. దీంతో నియోజకవర్గ ప్రజల పరిస్థితి ప్రమాదమేనని ఆందోళన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ కు ఓటు వేస్తే యాకుత పురా, మలక్ పేట్ నియోజక వర్గాలకు పట్టిన గతే రాజేంద్రనగర్ కు పట్టే ప్రమాదం ఉందని వివరించారు. మజిస్ కు ఒత్తసు పలికే పార్టీలకు కాకుండా బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే మజ్లిస్ కుట్రలు సాగనివ్వనని హామీనిచ్చారు. నియోజకవర్గంలో పునర్విభజన లో పార్టీ చూసుకుంటాదన్నారు. బీజేపీకి ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలను అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి కోరారు.