- ప్రజలకు బీఆర్ఎస్ నాయకుల అభ్యర్థన
వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 10, 11వ వార్డులలో గురువారం ఇంటింటా ప్రచారంలో భాగంగా ప్రతీ ఓటరుని బీఆర్ఎస్ నాయకులు కలిశారు. రెడ్యానాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో వివరిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు, ప్రజలు లబ్ది పొందుతున్న తీరు వివరించారు. డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యా నాయక్ సారధ్యంలో జరుగుతున్న అభివృద్ధి తీరును ప్రచారం చేశారు. బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మరిపెడ మున్సిపాలిటీ 11వ వార్డ్ కౌన్సిలర్ ఏడెల్లి పరశరములు, పార్టీ ముఖ్య నాయకులు, పెద్దలు, యూత్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు.