వేద న్యూస్, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య ప్రారంభించారు. ఈ శిబిరంలో మహిళా వైద్యులు, పిల్లల వైద్యులు, కంటి, దంత, ఎముకల నిపుణులు, సాధారణ వైద్యులు పాల్గొని గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, వైద్యాధికారి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *