వేద న్యూస్, చందుర్తి:
చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన మంజెల లస్మయ్య పూరి గుడిసె అగ్నిప్రమాదంలో దగ్ధమై కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో హరిహర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సహాయం అందించారు. గురువారం ట్రస్ట్ తరఫున బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం పంపిణీ చేసి పరామర్శించారు. ఈ ఘటనలో కుటుంబం సర్వం కోల్పోయిందని, మానవత్వంతో ముందుకు వచ్చి వారికి సహాయం చేయాలని ట్రస్ట్ సభ్యులు ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *