వేద న్యూస్, వరంగల్ టౌన్:

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 35వ డివిజన్లో అనారోగ్యంతో మృతి చెందిన గౌసియా కుటుంబాన్ని కొండా దంపతుల ఆదేశానుసారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 5000 రూపాయలను ఆర్థిక సాయం చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు శ్రీరామ్ రాజేష్. ఈ సందర్భంగా శ్రీరాం రాజేష్ మాట్లాడుతూ తనకి తోచిన విధంగా ఆర్ధిక సహాయం చేశానన్నారు.వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి మున్ముందు కూడా కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ నాయకులు పగడాల సతీష్, అక్షిత్ పటేల్, బండి నరేందర్, ప్రియదర్శిని, ముంతాజ్, శ్రీలత, లత, బలరామ్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *