వేద న్యూస్,పాపన్నపేట:
అంబేద్కర్ లాంటి మహానుభావులు నూటికో … కోటికో ఒకరు జన్మిస్తారని అలాంటివారు మనదేశంలో జన్మించడం మన అదృష్టమని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన పాపన్నపేట లో అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఆయన అంబేద్కర్ విగ్రహ దాతగా వ్యవహరించారు. అలాగే ఆయన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు, ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల లేసి నివాళులర్పించారు, అంతకుముందు పాపన్నపేట గ్రామ శివారు నుండి హనుమంతరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, మేజర్ గ్రామపంచాయతీ పాపన్నపేట సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నీరుడి వెంకటేశం, మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు బంజ శ్రీశైలం, దండం సుశీల, శ్రీధర్, శేఖర్ ,నాగరాజు, అంజయ్య, సిద్ధిరాం రెడ్డి, నిమ్మలగారి సిద్దు ,కొంపల్లి పాపయ్య, యువజన నాయకులు నీరుడి ప్రదీప్ కుమార్ కుంటి గారి శివ , ప్రశాంత్, దానబాబు శీను ప్రవీణ్, ప్రశాంత్, సామిల్ బట్టి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.