వేదన్యూస్ హైదరాబాద్ (బంజారాహిల్స్ ) :

కల్వకుంట్ల కవిత సమక్షంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కు సంబందించిన ముఖ్య నాయకుల సమావేశం వరంగల్ TRS నాయకులు మడిపెల్లి సుశీల్ గౌడ్. గడ్డం సంతోష్ బండారి సుమన్ హరి కొప్పుల చక్రధర్ పాల్గోన్నారు.

ఈ సమావేశంలో పార్టీ విధి విధానాలు, పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ ప్రణాళిక,జెండా గద్దెల నిర్మాణం గురించి కవిత వివరించడం జరిగింది.

టిఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా కార్యకర్తలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరువ కావలసిన అవసరం ఉంది. కలిసి వచ్చే వారిలో సమాజం పట్ల భాద్యత, అంకితభావం కలిగిన చురుకైన కార్యకర్తలతో సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉంది. రాజకీయ చైతన్యం నిండిన ఒక బలమైన జన సమూహాన్ని ప్రజా ఉద్యమాల కోసం నిర్మిద్దాం అని అన్నారు.

అనంతరం మడిపెల్లి సుశీల్ గౌడ్. గడ్డం సంతోష్ బండారి సుమన్ హరి కొప్పుల చక్రధర్కి తెలంగాణ రక్షణ సేన కండువా కప్పడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *