వేదన్యూస్ కాళేశ్వరం :
కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 5:43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు దంపతులు, మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి, పుష్కరాల ప్రారంభవేడుకలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.