వేదన్యూస్ తెలంగాణ :
తెలంగాణ లో జూన్ 2 నుంచి దాదాపు 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. తొలుత దివ్యాంగులు, తర్వాత వృద్ధులు, వితంతువులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. మరోవైపు సెర్చ్ రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్ల వివరాలను ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో నమోదు చేస్తోంది. మృతులను జాబితా నుంచి తొలగించనుంది.