వేదన్యూస్ కాళేశ్వరం :
సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఈ సందర్భంగా పుష్కర స్నానాలకు వచ్చి తప్పిపోయిన వ్యక్తుల కోసం ప్రత్యేక శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాదు, స్నానాలు ఆచరిస్తున్న భక్తుల రక్షణ కొరకు 50 మంది ఈతగాళ్లు, లైఫ్ జాకెట్స్, బోట్లను సిద్ధం చేశారు. ఉదయం నుంచే కాళేశ్వరానికి భక్తులు తరలివస్తున్నారు.