వేదన్యూస్ తెలంగాణ
దేశంలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా బయట నుంచి ఇంటికి రాగానే చల్లటి నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం సహజంగా చల్లబడిన తర్వాతే సాధారణ నీరు లేదా కొద్దిగా చల్లని నీరు తాగాలని సూచిస్తున్నారు. చల్లటి నీరు తాగడం వల్ల రక్తనాళాలు ముడుచుకుపోవడం, మైగ్రేన్, సైనస్, జీర్ణక్రియ మందగించడం, గొంతు నొప్పి, తలనొప్పి, గుండె కొట్టుకునే రేటులో మార్పులు వంటి ఇబ్బందులు తలెత్తవచ్చని తెలిపారు. వీలైతే కొబ్బరినీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి తాగడం మంచిదని సలహా ఇచ్చారు.