వేదన్యూస్ ఆంద్రప్రదేశ్
టీడీపీ మహానాడులో ఓ దృశ్యం అందరినీ ఆకర్షించింది. నిన్న పార్టీ అధినేత చంద్రబాబు వర్షిణి అనే ట్రాన్సజెండర్కు సభలో మాట్లాడే అవకాశం ఇచ్చారు. మహానాడు చరిత్రలో ట్రాన్స్ జెండర్ ప్రసంగించడం ఇదే తొలిసారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం చంద్రబాబు వర్షిణిని పక్కన కూర్చోబెట్టుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షిణి గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి పీఏగా పని చేస్తున్నారు.