వేదన్యూస్ ఖిలా వరంగల్

పేద ప్రజల వ్యతిరేకి బిజెపి ప్రభుత్వంపెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఎమ్మార్వో కు వినతిపత్రం…..

ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలో పెంచినందుకు కార్మిక హక్కులను కాలరాసి నందుకు M.C.P.I.U. పార్టీ ఆధ్వర్యంలో కిలా వరంగల్ రంగసాయిపేట కరీమాబాద్ ఏరియా కార్యదర్శిలు కిల వరంగల్ ఎమ్మార్వోకి ధరలు తగ్గించాలని మెమొరండం ఇవ్వడం జరిగినది

 

ఈ సందర్భంగా నగర సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్ మాట్లాడుతూ….

పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం వలన రవాణా చార్జీలు, నిత్యవసర ల ధరలు ఆకాశాన్ని అంటుతాయని అన్నారు. యువతకు ఉద్యోగాలు లేక చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు కావున డిజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించి యువతకు ఉద్యోగాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రంగసాయిపేట ఏరియా కార్యదర్శి గణిపాక ఓదెలు కరీమాబాద్ ఏరియా కార్యదర్శి ఐతం నగేష్ జిల్లా కమిటీ సభ్యులు అప్పనపురి నరసయ్య మాలి ప్రభాకర్ రాయినేని ఐలయ్య రఫీ రమేష్ రమ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *