వేదన్యూస్ తెలంగాణ
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2, 2026న చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి 91 మంది ఖైదీలు సత్ప్రవర్తన ఆధారంగా విడుదలయ్యారు. వీరిలో 85 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఈ విడుదల జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఒకే ప్రభుత్వంలో రెండుసార్లు ఖైదీలను సత్ప్రవర్తనపై విడుదల చేయడం అరుదని, ఇది రెండవసారి అని, ఇంతకుముందు సుమారు 230 మందిని విడుదల చేశామని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సంవత్సరానికి మూడుసార్లు విడుదల చెయ్యాలని తెలిపారు.