వేద న్యూస్, రుద్రూర్ : విశ్వకర్మ యువజన పథకం ద్వారా రెండు సంవత్సరాల కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రుద్రూర్ మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరు ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం వాషింగ్ మెషిన్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ .. విశ్వకర్మ యువజన పథకం కింద 16 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారని, శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్లకి వాషింగ్ మెషిన్లు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *