వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించినందున విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు రేపు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ప్రభుత్వ,ప్రైవేటు , పాఠశాల తో పాటు కాలేజీలకు, అంగన్వాడిలకు కూడా సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, వర్షాలు, వరదలు, లోతట్టు ప్రాంతాల నివాసులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. జిల్లాలో వర్ష పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని,

టోల్ ఫ్రీ నెంబర్ 18004253424,9154252936 

24 గంటలు పనిచేస్తుందని, అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు అయితే వెంటనే పైన పేర్కొనబడిన టోల్ ఫీ నెంబర్ కి కాల్ చేయగలరని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *