వేద న్యూస్ , కరీంనగర్:
కరీంనగర్ జిల్లాకు చెందిన మన్హా రియాజ్ జాతీయస్థాయి ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైంది. ఈనెల 25న చత్తీస్ గడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ లో జరగనున్న జూనియర్ గర్ల్స్ జాతీయ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ (2026-27 టైర్- 2)లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ సందర్భంగా మన్హా రియాజ్ ను ఫుట్ బాల్ సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి గణపతి అభినందించారు. ఆమె సాధించిన ఈ ఘనతను సోమవారం ప్రశంసించారు.