వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : నిర్మల్‌లో నవంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ పోటీలలో పాల్గొనే వరంగల్ జిల్లా జట్టుకు ఆద్యా అసోసియేషన్ ఎండీ లింగం కిరణ్ క్రీడా దుస్తులను పంపిణీ చేశారు.వరంగల్ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పూజారి అశోక్‌బాబు, ట్రెజరర్ భీమగాని ముఖర్జీ ఆధ్వర్యంలో జిల్లా జట్టు రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా క్రీడాకారిణులకు క్రీడా దుస్తులను అందజేసిన లింగం కిరణ్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లో వరంగల్ జిల్లా జట్టు ప్రతిభను చాటుతూ గోల్డ్ మెడల్ సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారిణులు క్రమశిక్షణ, పట్టుదలతో ఆడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జట్టు గోల్డ్ మెడల్ సాధిస్తే క్రీడాకారిణులకు ప్రత్యేక పారితోషికం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంతిని శివప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ లింగం కుమారస్వామి, కోచ్ ఎన్. శ్రీకాంత్, పీడీ బి. సర్దార్, మేనేజర్ డి. మంజుల, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సాఫ్ట్‌బాల్ కోచ్ బుస రాజు తదితరులు పాల్గొన్నారు.
