*ఏడుపాల రవి మృతి తీరని లోటు*
*
*రవి కుటుంబానికి అండగా ఉంటాం*
*రవి అంత్యక్రియలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి*
వేద న్యూస్, పాపన్నపేట
పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బీ ఆర్ఎస్ కార్యకర్త ఏడుపాల రవి బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్తపల్లి గ్రామానికి చేరుకొని రవి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రవి భార్య, పిల్లలను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రవి మృతి పార్టీకి, కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం రవి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని,అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మ జగన్, ఉపసర్పంచ్ రాము, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జగన్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రామకృష్ణయ్య, మాజీ సర్పంచులు గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి, బద్రి, మల్లేశం, నాయకులు దుర్గా దాస్, సోమశేఖర్, రాజు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
