*సొంతింటి కళ… ఇందిరమ్మ ఇళ్లతోనే సాధ్యం!*
*సర్పంచ్ పావని నరేందర్ గౌడ్*
వేద న్యూస్, పాపన్నపేట
పేద ప్రజల సొంతింటి కలను నిజం చేస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఒక వరం లాంటివని పాపన్నపేట గ్రామ సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.
మంగళవారం మండల కేంద్రమైన పాపన్నపేటలో దూదేకుల హుస్సేన్ బీ నూతన గృహ నిర్మాణానికి సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ ముగ్గు వేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవారికి సొంతిల్లు సమకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ పథకం ద్వారా ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నరేందర్ గౌడ్, ఉపసర్పంచ్ సద్దామ్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు దోసని సంగమేశ్వర్, ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొని నూతన గృహ నిర్మాణ పనులను ప్రారంభించారు
