*మల్లంపేటలో ఘనంగా ‘ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు..*
*సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు!*
వేద న్యూస్, పాపన్నపేట
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మల్లంపేట గ్రామంలో ‘ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు’ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులు కోట ఇందిర – రమేష్ నివాసంలో ఈ వేడుకలు జరిగాయి. ప్రభుత్వ సహాయంతో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంట దీపావళి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు.
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు:*
ఇదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను కూడా అదే లబ్ధిదారుని గృహంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నాయకులు, గ్రామస్థులు కలిసి కేక్ కట్ చేసి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం, ముఖ్యంగా పేదల ఇళ్లు మరిన్ని వెలుగులతో నిండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక పెద్దలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మల్లంపేట గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించింది.
