మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీగా అర్క అశోక్ నియామకం*
*పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: అర్క అశోక్*
వేద న్యూస్, పాపన్నపేట 09
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. ఇందులో భాగంగా గాంధారిపల్లి గ్రామానికి చెందిన యాక్టివ్ లీడర్ అర్క అశోక్‌ను మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీగా నియమించారు.
టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కబంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు, మెదక్ జిల్లా డీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ తాడేపు మహేందర్ అధ్యక్షతన ఈ నియామకం జరిగింది. మెదక్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా అర్క అశోక్ ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు.
*పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: అర్క అశోక్*
ఈ సందర్భంగా నియామక పత్రం అందుకున్న అర్క అశోక్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన టీపీసీసీ అగ్ర నాయకత్వానికి, జిల్లా నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు, డీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ తాడేపు మహేందర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
పార్టీ అప్పగించిన ఈ బాధ్యతను అత్యంత చిత్తశుద్ధితో నిర్వహిస్తానని అశోక్ పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ఎస్సీ డిపార్ట్మెంట్ అభివృద్ధికి, దళిత వర్గాల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
