*రోడ్డు ప్రమాదంలో మరణించిన పీఏసీఎస్ అటెండర్ కుటుంబానికి ఆర్థిక సహాయం*

*మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన పాపన్నపేట సహకార సంఘం.. రూ. 20 వేల ఆర్థిక సాయం*

పాపన్నపేట

పాపన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS)లో గత 16 సంవత్సరాలుగా అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న బేకరి కొమ్ము జయచందర్ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఆయన మృతి పట్ల సహకార సంఘం పాలకవర్గం మరియు సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా మృతుడు జయచందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం సంఘం తరఫున రూ. 20,000 (ఇరవై వేల రూపాయలు) నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ ఆపద సమయంలో బాధిత కుటుంబానికి సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జయచందర్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జి. మల్లేశం, డైరెక్టర్లు లక్ష్మీనారాయణ, షాద్ భాషా, మోహన్ రెడ్డి, పుష్పలత లక్ష్మా గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, సంఘం సెక్రటరీ నవీన్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *