వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట మండల పరిధిలోని కోరపల్లి గ్రామానికి చెందిన గిరివేన శ్యామ్ ఇటీవల కాలం చేశారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు. వారి భవిష్యత్తు, చదువులను దృష్టిలో పెట్టుకొని తమ వంతుగా అండగా నిలవాలనే మంచి ఆలోచనతో కోరపల్లి గ్రామ ప్రజలు, యాదవ యువత సభ్యులు, మిత్రుల సహకారంతో విరాళాల సేకరించారు.
ఈ కార్యక్రమానికి స్పందించి తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరూ తమ సేవ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అందరి సహకారంతో మొత్తం రూ.59,059 విరాళాలు సేకరించి, ఆ మొత్తాన్ని వారి పెద్ద కూతురు పేరుపై ఉన్న పోస్ట్ ఆఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో జమ చేశారు.
ఇకముందు కూడా ఆ ఇద్దరు చిన్నారుల చదువులకు, భవిష్యత్తుకు మన వంతుగా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చొరవ చూపాలని ఈ సందర్భంగా యువకులు కోరారు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాకు సంబంధించిన బుక్ ను ఆదివారం శ్యామ్ కుటుంబీకులకు అందజేశారు.
