- “కారు” దిగి “చెయ్యి” అందుకుంటున్న నాయకులు, కార్యకర్తలు
వేద న్యూస్, జమ్మికుంట:
హుజురాబాద్ నియోజకవర్గంలో భారీ ఎత్తున టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కారు దిగి చెయ్యిని అందుకుంటున్నారు. ఆదివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల కొత్తపల్లి అంబేద్కర్ కాలనీ నుండి సుమారు 200 మంది కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యం అని నమ్మిన ప్రజలు రాష్ట్రం అభివృద్ధి చెందాలని దానితోపాటు హుజరాబాద్ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అని నిర్ణయించుకున్న కార్యకర్తలు ప్రజలు నాయకులు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మరోపక్క మరో పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా తనదైన శైలిలో నియోజకవర్గంలో అన్ని తానై కార్యకర్తలను నాయకులను సమన్వయ పరుస్తూ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ప్రణవ్ బాబు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకోవడం కనిపిస్తుంది.
ఈ క్రమంలోనే జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ కుతాడి రాజయ్య ఆధ్వర్యంలో సుమారు 50 మంది నాయకులు కార్యకర్తలు ఆదివారం ప్రణవ్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని సామాజిక వర్గాల నుండి మద్దతు సంపూర్ణంగా లభిస్తుందని స్వచ్ఛందంగా బీసీలు, ఎస్సీలు ఎస్టీలు అందరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉన్నారని కౌన్సిలర్ కుతాడి రాజయ్య నాయకులు బొడికల సమ్మయ్య అన్నారు.
ఆదివారం హుజురాబాద్ ఎల్ఐసి బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ బోడికల సమ్మయ్య తన అనుచరులతో కలిసి ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యంగా మంచికి మారుపేరైన ప్రణవ బాబు సమక్షంలో పనిచేయడం సంతోషంగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట కౌన్సిలర్లు పొన్నగంటి మల్లయ్య రావికంటి రాజకుమార్ తదితరులు ఉన్నారు. పార్టీలో చేరిన వారు బోడికల సమ్మయ్య పల్లపు పోశెట్టి బొడికల మల్లయ్య బోడికల రాజయ్య బోడికల నరేందర్ ప్రణయ్ వినయ్ యుగంధర్ విజయ్ సుమన్ శ్రీనివాస్ రాజు, రాజేష్ సాయి చిలుక చక్రి మల్లమ్మ ప్రసాదు శ్రీ కళ రాజబాబు తదితరులు ఉన్నారు.