భవిష్యత్ తరాలకు అందిద్దాం

కేయూ భూములను కాపాడాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

వేద న్యూస్, హనంకొండ:

అన్యక్రతమవుతున్న కాకతీయ యూనివర్సిటీ భూములను కాపాడాలని, యూనివర్సిటీ భూములకు హద్దులు నిర్మించి ప్రహరి గోడ నిర్మించాలని, గత నెల 17వ తారీఖున యూనివర్సిటీ పాలకమండలి యూనివర్సిటీ భూములలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాలకమండలి ఆమోదం తెలిపిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన భారత్ బచావో రాష్ట్ర నాయకులు విశ్రాంత అధ్యాపకులు వెంగల్ రెడ్డి, ఓం బ్రహ్మంలు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం వివిధ అవసరాల దృశ్య కొంత భూమిని తీసుకున్నదని, కబ్జా కోరలు కొంత భూమిని ఆక్రమించారని ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం 20 నుండి 30 ఎకరాల వరకు భూములు తీసుకోవడం వలన యూనివర్సిటీ భవిష్యత్తు అవసరాలకు భూముల కొరత ఏర్పడుతుంది కావున యూనివర్సిటీ భూములను ఇతరత్రా అవసరాలకు వినియోగించకుండా భవిష్యత్తు యూనివర్సిటీ అవసరాల కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉంది కావున యూనివర్సిటీ అధికారులు ఈ విషయమై దృష్టి సారించి అన్యాక్రతమవుతున్న భూముల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని వారన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల భాద్యులు పిడిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, డిఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్, బిఎస్ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్షులు శివకుమార్, బిఆర్ఎస్వి యూనివర్సిటీ నాయకులు పస్తం అనిల్ కుమార్ తదితరులు మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమంలో డిఎస్ఏ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు సాయి, జశ్వంత్ లతో పాటు శేఖర్, సురేష్, నరేష్ లతో పాటు యూనివర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.